అనిశా వలకు చిక్కిన అవినీతి తిమింగలం‌

అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. భూవ్యవహారంలో భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ కీసర మండల తహసీల్దార్‌ నాగరాజు అనిశా అధికారులకు పట్టుబడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 15 Aug 2020 01:13 IST

₹1.10 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తహసీల్దార్‌


(ప్రతీకాత్మక చిత్రం)

మేడ్చల్‌: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు మరో తిమింగలం చిక్కింది. భూవ్యవహారంలో భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మేడ్చల్‌ జిల్లా  కీసర మండల తహసీల్దార్‌ నాగరాజు అనిశా అధికారులకు పట్టుబడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..తహసీల్దార్‌ నాగరాజు మండలంలోని రాంపల్లిలో ఉన్న 28 ఎకరాల భూవ్యవహారమై గత కొంత కాలంగా డబ్బు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు శుక్రవారం ఏఎస్‌రావు నగర్‌లోని అతని ఇంట్లో రూ.కోటి 10 లక్షలు తహసీల్దార్‌ తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అతనితో పాటు భూవ్యవహారంలో పాల్గొన్న అంజిరెడ్డి,  స్థిరాస్తి వ్యాపారి‌ శ్రీనాథ్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. గతంలో ఇదే తహసీల్దార్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని కేసులు నమోదై ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని