
TS news : డిపాజిట్ల కుంభకోణం.. మరోసారి మస్తాన్వలీ అరెస్టు
హైదరాబాద్ : తెలుగు అకాడమీ డిపాజిట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. మస్తాన్వలీకి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. జైలు నుంచి విడుదలైన వెంటనే మరో కేసులో సీసీఎస్ పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థలోనూ రూ.4 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్ము కాజేసేందుకు మస్తాన్వలీ కుట్ర పన్నారని పోలీసులు అభియోగం మోపారు. ఈ మేరకు వివరాలను సీసీఎస్ జాయింట్ సీపీ మీడియాకు వెల్లడించారు. తెలుగు అకాడమీ కేసు నిందితుల నుంచి రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.‘‘ కాజేసిన సొమ్ముతో నిందితులు ఆస్తులు కొన్నారు. నిందితులు కొనుగోలు చేసిన ఫ్లాట్లు, భూములు స్వాధీనం చేసుకున్నాం. మరిన్ని స్థిరాస్తులపై ఇంకా వివరాలు సేకరిస్తున్నాం’’ అని సీపీ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థలు తమ ఎఫ్డీల గురించి బ్యాంకుల్లో తెలుసుకోవాలని కోరారు.