Updated : 11/02/2021 06:27 IST

HYD: ఫార్మసీ విద్యార్థినిపై హత్యాయత్నం

హైదరాబాద్‌‌: మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఫార్మసీ విద్యార్థినిని ఓ ఆటోడ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు యువకులు‌ కిడ్నాప్‌ చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి కళాశాల నుంచి ఇంటికి వెళ్తుండగా బలవంతంగా జోడిమెట్ల దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారు.  యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని మేడిపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

ఇవీ చదవండి..

వరంగల్‌ జిల్లాలో విషాదం

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని