Updated : 16/06/2021 11:34 IST

TS News: ఏటీఎం చోరీకి వెళ్లి..తేలు కుట్టిన దొంగల్లా!

మధిర: ఖమ్మం జిల్లా మధిరలో అర్థరాత్రి వేళ ఏటీఎంలో చోరీకి వెళ్లిన ఇద్దరు దొంగలు చేసిన పని నవ్వులు పూయిస్తోంది. అంతా పక్కా ప్లాన్  ప్రకారమే చేసినా చివర్లో వారి అంచనా తప్పింది. ఆఖరికి తేలు కుట్టిన దొంగల్లా వారిద్దరూ అక్కడ్నుంచి జారుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. మధిర బస్టాండ్‌ సమీపంలోని మెయిన్‌రోడ్డులో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి కింద ఓ ప్రైవేట్‌ ఏటీఎం ఉంది. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలన్నంత పకడ్బందీ ప్రణాళికతో అర్ధరాత్రి వేళ ఇద్దరు దొంగలు ఏటీఎంలోకి వచ్చారు. అందులో ఉన్న సీసీ కెమెరాను ముందుగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఏటీఎం యంత్రాన్ని తెరిచేందుకు ఇద్దరూ శాయశక్తులా ప్రయత్నించారు. కానీ దాన్ని తెరవడం ఇద్దరి వల్లా కాలేదు. అయితే ఈలోపు వారికి జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. కరోనా వేళ జాగ్రత్తగా మాస్కులు ధరించి చోరీకి వచ్చిన కేటుగాళ్లు.. ఏటీఎంలో ఉన్న మరో సీసీ కెమెరాను మాత్రం గుర్తించలేకపోయారు. చోరీ చేసేందుకు వచ్చిన వీరి తతంగమంతా ఆ కెమెరాలో నిక్షిప్తమైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏటీఎం నిర్వాహకుడు శ్రీకాంత్‌ తెలిపారు.


Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని