
TS News: సర్వోమాక్స్ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లించిన కేసులో సర్వో మాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావు(ఏవీఆర్) ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక న్యాయస్థానంలో ఏవీఆర్ను హాజరుపర్చగా... న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పలు బ్యాంకుల నుంచి ఏవీఆర్ రూ.402 కోట్లు రుణం తీసుకున్నారు. దీని కోసం కొనుగోళ్లు చేసినట్టు, లావాదేవీలు నిర్వహించినట్టు నకిలీ పత్రాలు సృష్టించారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు ఏడాది క్రితం సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపు కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఏవీఆర్తో పాటు, ఆయన బినామీలకు చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. డొల్ల కంపెనీలు స్థాపించి బ్యాంకు రుణాలను ఆ ఖాతాల్లో మళ్లించి, అక్కడి నుంచి వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసినట్ట ఈడీ వెల్లడించింది.