కురిచేడు శానిటైజర్‌ ఘటన: 10మంది అరెస్టు

ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్‌ మృతుల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేశామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. శానిటైజర్‌ తాగి మొత్తం 16 మంది చనిపోయారని తెలిపారు. శానిటైజర్‌

Published : 11 Aug 2020 18:27 IST

ఒంగోలు: ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్‌ మృతుల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేశామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. శానిటైజర్‌ తాగి మొత్తం 16 మంది చనిపోయారని తెలిపారు. శానిటైజర్‌ తాగుతున్న మరో 50 మందిని గుర్తించి చికిత్స అందించి కాపాడమని చెప్పారు. 

‘‘పలు శానిటైజర్‌ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించాం. పర్‌ఫెక్ట్‌ అనే బ్రాండ్‌ శానిటైజర్లను అక్రమంగా తయారు చేశారు. వాటి నమూనాలను సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబ్‌కు పంపాం. శానిటైజర్‌ తయారీ సమయంలో అధికారులకు చిక్కినా లంచం ఇచ్చి బయటపడ్డారు. ఈ శానిటైజర్‌ ఘటనలో మొత్తం పది మందిని అరెస్టు చేశాం. వారిలో ఇద్దరు శానిటైజర్‌ తయారీదారులు, దుకాణ యజమాని, సరఫరాదారుడు ఉన్నారు’’అని ఎస్పీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని