Crime News: ప్రేమోన్మాది బస్వరాజుకు 14 రోజుల రిమాండ్‌

ఎల్బీనగర్‌ పోలీసుల అదుపులో ఉన్న ప్రేమోన్మాది బస్వరాజుకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

Updated : 11 Nov 2021 15:38 IST

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ పోలీసుల అదుపులో ఉన్న ప్రేమోన్మాది బస్వరాజును ఇవాళ రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. నగరంలోని ఎల్బీనగర్‌ ప్రాంతంలో నిన్న బస్వరాజు కత్తితో ఓ యువతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. మరోవైపు బాధితురాలి తల్లిదండ్రులు, సోదరుడు వికారాబాద్‌ జిల్లా నుంచి యువతి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువతి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. తమ కుమార్తె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. దాడి చేసిన బస్వరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. యువతి ఒంటిపై 18 చోట్ల గాయాలయ్యాయని.. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని