Crime News: వయసు 17.. చోరీలు 48.. జువైనల్‌ హోంకు వెళ్లొచ్చినా మారని వైనం

ఓ 17ఏళ్ల బాలుడు 48 చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. జువైనల్‌ హోంకు వెళ్లొచ్చినా పద్ధతి మార్చుకోకపోవడంతో మళ్లీ అరెస్టు చేశారు. శనివారం ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణ

Updated : 22 Aug 2021 07:28 IST

కాకినాడ (ఇంద్రపాలెం), న్యూస్‌టుడే: ఓ 17ఏళ్ల బాలుడు 48 చోరీలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. జువైనల్‌ హోంకు వెళ్లొచ్చినా పద్ధతి మార్చుకోకపోవడంతో మళ్లీ అరెస్టు చేశారు. శనివారం ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో సీఐ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ మండలం తూరంగి పగడాలపేటకు చెందిన మైనర్‌ 14ఏళ్లకే దొంగతనాల బాటపట్టాడు. గతంలో కొన్ని కేసుల్లో జువైనల్‌ హోంకూ వెళ్లొచ్చాడు. బయటకు వచ్చి మళ్లీ ఇళ్లలో చోరీలు చేస్తున్నాడు. తాజాగా ఆగస్టు 8న తూరంగి ఏఎస్‌ఆర్‌ కాలనీలో మరికొందరితో కలిసి చోరీకి పాల్పడ్డాడు. ఇందులోనూ ప్రధాన నిందితుడు ఈ బాలుడేనని పోలీసులు తెలిపారు. ఈ కేసులో బాలుడితోపాటు రాయుడు గోపాలకృష్ణ (31), చాట్ల రమేష్‌ను (30) అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారని వెల్లడించారు. వారి నుంచి రూ.1,35,000 విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని