
Updated : 08 Sep 2021 10:03 IST
Crime News: చెల్లి పెళ్లికి చేసిన అప్పు తీర్చేందుకు దొంగగా మారిన అన్న..
పలమనేరు: చెల్లెలు పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఓ యువకుడు దొంగగా మారాడు. పోలీసుల కథనం ప్రకారం... చిన్నగొట్టిగల్లు మండలం చెట్టెంవారిపల్లె గ్రామానికి చెందిన చక్రధర్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తన సొంత గ్రామంలోనే చెల్లెలు పెళ్లి చేశాడు. అందుకు చేసిన అప్పులు తలమీదికి వచ్చాయి. పైగా చేస్తున్న ఉద్యోగం కాస్త పోయింది. ఇక చేసేది లేక చోరీలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో శనివారం రాత్రి మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన అముద అనే మహిళ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంగళవారం సాయంత్రం నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి 53 గ్రాముల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.
Tags :