Crime News: షోరూం నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా అదుపుతప్పిన కారు

కొత్త కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఆ వాహనం అదుపుతప్పిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి అక్కారంపల్లికి...

Updated : 28 Nov 2023 16:25 IST

తిరుపతి నేర విభాగం: కొత్త కారు కొనుగోలు చేసి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఆ వాహనం అదుపుతప్పిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి అక్కారంపల్లికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ ఓ కొత్త కారును కొనుగోలు చేశారు. ఆ కారును షోరూం నుంచి లీలామహల్‌ వైపున్న తన నివాసానికి తీసుకెళ్తుండగా స్థానిక ఎస్కే ఫాస్ట్‌ఫుడ్స్‌ వద్ద టైరు పేలి ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న జనాలు, వాహనాలపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. ఆరు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే కారులోని వ్యక్తి తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని