TS News: మేడ్చల్‌ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌

మేడ్చల్‌ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో రూ.2కోట్లు విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.

Updated : 23 Oct 2021 16:03 IST

మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. తనిఖీల్లో భాగంగా కారులో ఉన్న మెపిడ్రిన్‌ డ్రగ్‌ను ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పవన్‌, మహేందర్‌రెడ్డి, రామకృష్ణగౌడ్‌ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ఎస్‌.కె.రెడ్డి, హనుమంతరెడ్డి పరారీలో ఉన్నారు. నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. విద్యార్థులకు సరఫరా చేయడానికి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఇదే కేసులో కూకట్‌పల్లిలో పవన్‌ అనే వ్యక్తి వద్ద డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడు ఇచ్చిన సమాచారంతో మేడ్చల్‌లోని మహేశ్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. మహేశ్‌ వద్ద 926 వద్ద మెపిడ్రిన్‌ను గుర్తించారు. మహేశ్‌ ఇచ్చిన సమాచారంతో నాగర్‌కర్నూల్‌ వాసి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. మొత్తం మూడు ప్రాంతాల్లో 4.92 కిలోల డ్రగ్స్‌, కారును అధికారులు సీజ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని