Fire Accident: కోరుట్లలోని షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం

జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలో ఉన్న ఆనంద్‌ షాపింగ్‌ మాల్‌లోని వస్త్ర దుకాణంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి..

Updated : 18 Aug 2021 13:33 IST

కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలో ఉన్న ఆనంద్‌ షాపింగ్‌ మాల్‌లోని వస్త్ర దుకాణంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పెద్ద ఎత్తున వ్యాపించ భవనం మొత్తం అంటుకున్నాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో షాపింగ్‌ మాల్‌లోని సామగ్రి అంతా కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టినా.. మంటలు అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టింది. అప్పటికే భారీగా ఆస్తినష్టం జరిగింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని