Crime News: అయిటిపాముల శివారులోని ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల శివారులో ఉన్న శ్రీరాఘవేంద్ర ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం..

Published : 06 Dec 2021 01:31 IST

కట్టంగూర్: నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల శివారులో ఉన్న శ్రీరాఘవేంద్ర ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఆయిల్‌ లీకేజీ కావడంతో వ్యాపించిన మంటలు పక్కనున్న ప్లాంటుకు అంటుకున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో రూ.60 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని