Crime news: ఎస్సై పరీక్ష రాసి వస్తున్న యువతిపై కారులోనే అత్యాచారం

సోషల్‌ మీడియా ద్వారా యువతితో పరిచయం ఏర్పరచుకున్న నిందితుడు.. ఆమెను నమ్మించాడని పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి...

Published : 26 Nov 2021 01:53 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మథురకు చెందిన 21 ఏళ్ల యువతిపై ఓ యువకుడు కదులుతున్న కారులోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎస్సై పరీక్ష రాసి ఆగ్రా నుంచి తిరిగి వస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు యువతితో కలిసి ఎస్సై పరీక్ష రాసేందుకు ఆగ్రాకు వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో కారులోనే ఆమెపై కిరాతక చర్యకు పాల్పడ్డాడు. అనంతరం యువతిని మథుర శివారులోని కోసి కలాన్‌ వద్ద వదిలి వెళ్లిపోయాడు.

సోషల్‌ మీడియాలో పరిచయంతో నమ్మించి.. 

బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడు తేజ్‌వీర్‌ని గురువారం అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు దిగంబర్‌ పరారీలో ఉన్నాడని మథుర రూరల్‌ ఎస్పీ శిరీష్‌ చంద్ర తెలిపారు. నిందితులిద్దరూ హరియాణాలోని మాన్‌పూర్‌కి చెందినవారిగా గుర్తించారు. దిగంబర్‌ను పట్టుకొనేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. తేజ్‌వీర్‌ సోషల్‌ మీడియా ద్వారా యువతితో పరిచయం చేసుకుని ఆమెను నమ్మించాడని పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అనంతరం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలం నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనలో నిందితుడు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులిద్దరూ 22 నుంచి 25 ఏళ్ల వయసు వారేనని పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని