Crime news: ప్రయాణికుల కళ్లెదుటే.. రైలుకు ఎదురు నిలబడి వ్యక్తి ఆత్మహత్య
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్లాట్‌ఫాం మీదకు వస్తున్న రైలుకు ఎదురు నిలబడి వలస కూలీ ఆత్మహత్యకు ..
రామగుండం: ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి రైలుకు ఎదురు నిలబడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఒడిశాలోని కైరాకు చెందిన సంజయ్ కుమార్ (27) తన తాతతో కలిసి హైదరాబాద్‌లోని ఓ హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్న సంజయ్‌కు కుటుంబ సభ్యులు వైద్యం చేయిస్తున్నట్టు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సురేశ్ తెలిపారు. గత కొన్ని రోజులుగా మతి స్థిమితం లేకుండా తిరుగుతున్న సంజయ్ హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. న్యూదిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తున్న రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైలు వస్తుందని ప్రయాణికులు వారిస్తున్నా వినకుండా.. పట్టాలపై రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్‌రెడ్డి రైస్‌మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్‌పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్‌కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్‌మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM