Maharastra: అమానుషం.. 6 నెలలుగా బాలికపై 400 మంది అత్యాచారం!

దిక్కుతోచని స్థితిలో ఉపాధి కోసం వెళ్లిన ఓ బాలికను కామాంధులు కాటేశారు. ఆరు నెలలుగా ఆమెపై 400 మంది అత్యాచారానికి ఒడిగట్టారు.....

Published : 15 Nov 2021 01:39 IST

ముంబయి: దిక్కుతోచని స్థితిలో ఉపాధి కోసం వెళ్లిన ఓ బాలికను కామాంధులు కాటేశారు. ఆరు నెలలుగా ఆమెపై 400 మంది అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. నిందితుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బీడ్‌లోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లి రెండేళ్ల క్రితం మృతిచెందింది. అనంతరం తండ్రి ఆమెను ఓ వ్యక్తికిచ్చి వివాహం చేశారు. అయితే తన మామ ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. అది భరించలేని బాలిక ఏడాది తర్వాత పుట్టింటికి వచ్చేసింది.

కొద్దిరోజులు ఇంట్లో ఉన్న ఆమె.. ఏదైనా ఉద్యోగం చేసుకుందామని అంబేజోగై పట్టణానికి చేరుకుంది. అయితే ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఓ ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. తర్వాత బాలికపై అనేక మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆరు నెలల వ్యవధిలో తనపై 400 మంది అఘాయిత్యానికి ఒడిగట్టారని.. అందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నట్లు బాధితురాలు పోలీసుకు తెలిపింది. ఎలాగోలా పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు తన గోడును వారి వద్ద వెల్లబోసుకుంది. ప్రస్తుతం ఆమె రెండు నెలల గర్భవతి. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని