TS News: ఈఎస్‌ఐ ఔషధాల  కుంభకోణం... రూ.144 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

ఈఎస్‌ఐ ఔషధాల కుంభకోణంలో మనీలాండరింగ్‌ చట్టం కింద ఇప్పటి వరకు రూ.144 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌ చేసినట్టు ఈడీ తెలిపింది.  ఈ కేసులో ఐదుగురు నిందితుల ఆస్తులు

Published : 24 Nov 2021 01:19 IST

హైదరాబాద్‌: ఈఎస్‌ఐ ఔషధాల కుంభకోణంలో మనీలాండరింగ్‌ చట్టం కింద ఇప్పటి వరకు రూ.144 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌ చేసినట్టు ఈడీ తెలిపింది.  ఈ కేసులో ఐదుగురు నిందితుల ఆస్తులు అటాచ్‌ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ పద్మజ, ఫార్మాసిస్టు కె.నాగమణి, కాంట్రాక్టర్లు కె.శ్రీహరిబాబు, పి.రాజేశ్వర్‌రెడ్డిలకు చెందిన మొత్తం 131 స్థిరాస్తులను ఈడీ అటాచ్‌  చేసింది.   తెలంగాణ, ఏపీ, బెంగళూరు, నోయిడాలో ఉన్న 97 ప్లాట్లు, 6 విల్లాలు, 18 కమర్షియల్‌ దుకాణాలు, పలు సెక్యూరిటీలు, ఎఫ్‌డీలు ఇందులో ఉన్నాయి. అనిశా కేసుల ఆధారంగా  ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని