Viveka Murder Case: సీబీఐ అదుపులో శివశంకర్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.

Updated : 22 Nov 2022 14:23 IST

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సలో ఉండగా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. శివశంకర్‌రెడ్డి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. ఇటీవల వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి వాంగ్మూలం మేరకు శివశంకర్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల్లో కూడా ఇతని పేరు ఉంది. ఇప్పటికే కడప, పులివెందులతో పలుమార్లు శివశంకర్‌రెడ్డి సీబీఐ విచారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు