కొవిషీల్డ్‌ అనుకుని పిల్లల టీకా అపహరణ

మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లోని ఒక ఆరోగ్యం కేంద్రంలో వ్యాక్సిన్‌ చోరీ జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అనుకుని పిల్లలకు సంబధించిన 300 వ్యాక్సిన్‌ వయెల్స్‌ను ఎత్తుకెళ్లిపోయారు.

Updated : 29 May 2021 06:04 IST

ముంబయి: మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లోని ఒక ఆరోగ్యం కేంద్రంలో వ్యాక్సిన్‌ చోరీ జరిగింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కొవిషీల్డ్‌ టీకా అనుకుని పిల్లలకు సంబధించిన 300 వ్యాక్సిన్‌ వయెల్స్‌ను అపహరించారు.  పోలీసులు సదరు వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు బాత్రూం కిటికీ బద్దలుకొట్టకుని లోపలకి వచ్చారని, ఆధారాలు దొరక్కుండా సీసీ టీవిని కూడా అపహరించారని పోలీసులు తెలిపారు. సదరు టీకాల మీద సీరం ఇన్‌స్టిట్యూట్‌ లోగో ఉండటంతో.. కరోనా టీకాలనుకొని దొంగతం చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. దుండగులు దొంగలించిన వాటిలో 25 టీబీ టీకాలు, 17 కోరింత దగ్గు టీకాలు, 13 ధనుర్వాతానికి సంబంధించిన టీకాలు, 15 పోలియో టీకాలు, 30 రుబెల్లా టీకాలు, 270 రోటా వైరస్‌ టీకాలు ఉన్నట్టు సమాచారం.    

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని