Chattisgarh:పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురి మృతి

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు

Updated : 18 May 2021 11:29 IST

 

బీజాపూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న జ‌రిగిన ఈ ఘ‌ట‌నలో ముగ్గురు మృతి చెంద‌డంతో పాటు 15 మందికి పైగా గాయాల‌య్యాయి. సిలిగ‌ర్ వ‌ద్ద పోలీస్ క్యాంపు ఏర్పాటుకు స్థానికులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. క్యాంపు ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ గిరిజ‌నులు ఆందోళ‌న‌కు దిగిన స‌మ‌యంలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

కాగా, త‌మ క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మావోల త‌మ‌పై దాడి చేసిన త‌ర్వాతే తాము ఎదురు కాల్పులు జ‌రిపిన‌ట్లు వివ‌రించారు. నిన్న రాత్రి నుంచి బ‌స్త‌ర్ పోలీస్ అధికారులు ఘ‌ట‌నాస్థ‌లిలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే పోలీసులు త‌మ‌పై అన్యాయంగా కాల్పులు జ‌రిపార‌ని.. 9 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయార‌ని స్థానికులు చెబుతున్నారు. 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని