mallareddy: సైదాబాద్‌ హత్యాచార ఘటన: రాజును వదిలిపెట్టే ప్రసక్తేలేదు: మంత్రి మల్లారెడ్డి

సైదాబాద్‌లో ఆరేళ్ల బాలిక హత్యాచారం ఘటనపై తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ..

Updated : 14 Sep 2021 19:43 IST

హైదరాబాద్‌: సైదాబాద్‌లో ఆరేళ్ల బాలిక హత్యాచారం ఘటనపై తెలంగాణ మంత్రి మల్లా రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. ‘అత్యాచారం ఘటన చాలా దారుణం. నిందితుడు రాజుకు కఠిన శిక్ష పడేలా చూస్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని మంత్రి హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు.

మరో వైపు నిందితుడు రాజుకోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆరు టాస్క్‌ పోర్స్‌ బృందాలు, నాలుగు  లా అండ్‌ ఆర్డర్‌ బృందాలు రాజు కోసం వెదుకుతున్నాయి. ట్యాంక్‌బండ్‌ సహా ప్రతి పార్కును క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు పలు విషయాలు తెలిశాయి. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత రాజు  పనిచేసిన కాంట్రాక్టర్‌ వద్దకు వెళ్లినట్టు గుర్తించారు. గతంలో పనిచేసినందున రావాల్సిన రూ.1800 తీసుకుని ఊరికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయినట్టు తేల్చారు. నిందితుడి వద్ద ఉన్న ఫోన్‌ స్విచాఫ్‌ చేసి పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు గుర్తు పట్టకుండా గుండు చేయించుకుని మాస్క్‌ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలో  కూడా దర్యాప్తు కొనసాగుతోంది. నగరంతో పాటు సైదాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేబర్‌ అడ్డాలను ప్రత్యేక బృందాలు జల్లెడపడుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని