Published : 06/08/2020 00:38 IST

రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

విజయనగరం జిల్లాలో ముగ్గురు చిన్నారులు

కామారెడ్డి జిల్లాలో ఇద్దరు కూలీలు

కామారెడ్డి/గంట్యాడ: తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. విజయనగరం జిల్లా గంట్యాడలో ముగ్గురు చిన్నారులు నీటమునిగారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంట్యాడ మండలం నరవ గ్రామంలో నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ చిన్నారులు నీటి కుంటలో పడిపోయారు. తల్లిదండ్రులు పనికి వెళ్లి తిరిగి రాగా చిన్నారుల ఆచూకీ కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వెతకగా.. నీటి కుంటలో మృతదేహాలు కనిపించాయి. 

ట్రాక్టర్‌ బోల్తా: ఇద్దరు మృతి
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం తడి హిప్పర్గ సమీపంలో కూలీల ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. డోంగ్లి నుంచి మహారాష్ట్రకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. పనుల కోసం మహారాష్ట్ర నుంచి డోంగ్లికి కూలీలు వచ్చారు. ప్రమాదసమయంలో ట్రాక్టర్‌లో 25 మంది ఉన్నారు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని