kidnap: ఎస్‌ఆర్‌నగర్‌లో వృద్ధుల కిడ్నాప్‌ కలకలం

నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ఇద్దరు వృద్ధురాళ్లను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం అమీన్‌పూర్‌

Published : 24 Sep 2021 01:27 IST

హైదరాబాద్‌: నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కిడ్నాప్‌ కలకలం సృష్టించింది. ఇద్దరు వృద్ధురాళ్లను నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో బంధించారు. వృద్ధుల కేకలు విన్న స్థానికులు అమీన్‌పూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని రక్షించి పోలీస్‌స్టేషన్‌కు తరలించి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం అమీన్‌పూర్‌ పోలీసులు ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఎఫ్‌ఐఆర్‌ను బదిలీ చేశారు. కీలకమైన భూమి పత్రాలతో పాటు కొంత బంగారాన్ని ఎత్తుకెళ్లారని బాధితులు పేర్కొన్నారు. న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మిరాజ్‌ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌నకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల పేరు మీద అమీర్‌పేటలోని లీలానగర్‌లో ఉన్న కోట్ల ఆస్తి కోసమే కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని