Chit Funds Fraud: చీటీల పేరుతో ₹45 కోట్లకు టోకరా

చీటీల పేరుతో మహిళ మోసం చేసిందంటూ అనంతపురం జిల్లా హిందూపురం రెండో పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. హిందూపురం సత్యనారాయణపేటకు చెందిన విజయలక్ష్మి 20 ఏళ్లుగా....

Published : 04 Aug 2021 01:38 IST

హిందూపురం: చీటీల పేరుతో ఓ మహిళ తమను మోసం చేసిందంటూ అనంతపురం జిల్లా హిందూపురం రెండో పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. హిందూపురం సత్యనారాయణపేటకు చెందిన విజయలక్ష్మి 20 ఏళ్లుగా ‘వైవీఏ గ్రూప్ ఫండ్స్’ పేరుతో చీటీ వ్యాపారం నిర్వహిస్తోంది. వారం రోజుల నుంచి ఆమె కనిపించకపోవడంతో అనుమానం వచ్చి కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ప్రజల నుంచి సుమారు రూ.45 కోట్లను వసూలు చేసి ఆ నగదుతో పరారైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. నిందితురాలిని పట్టుకొని నగదు ఇప్పించాలని కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని