
Published : 16 Oct 2021 01:54 IST
Viral video: ఫోన్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో పడిన మహిళ
ఫరీదాబాద్: చంటి బిడ్డతో రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడిన ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. ఫరీదాబాద్‌లోని జవహార్ కాలనీలో ఈ ఘటన జరగ్గా.. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మహిళ మ్యాన్‌హోల్‌లో పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అందులోకి దిగి బిడ్డను, మహిళను సురక్షితంగా బయటకు తీశారు. అయితే ప్రమాదానికి ముందు ఆ మహిళ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు సీసీ టీవీలో కనిపిస్తోంది. ఫోన్ సంభాషణలో నిమగ్నమై మ్యాన్‌హోల్‌ను చూసుకోనందువల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చదవండి
Tags :