సీసీటీవీ ఫుటేజ్‌: మాటల్లో పెట్టు.. చీరలు మూటకట్టు

నలుగురైదుగురు కలిసి దుకాణానికి ఒకేసారి వస్తారు. నిజంగా దుస్తులు కొనేందుకు వచ్చినట్లు హంగూ ఆర్భాటం

Published : 05 Feb 2021 02:15 IST

హైదరాబాద్‌: నలుగురైదుగురు కలిసి దుకాణానికి ఒకేసారి వస్తారు. నిజంగా దుస్తులు కొనేందుకు వచ్చినట్లు హంగూ ఆర్భాటం చూపిస్తారు. ఒకరిద్దరు సేల్స్‌మెన్‌ను మాటల్లో పెట్టి చీరలు బేరమాడుతుంటారు. మరోవైపు మిగిలిన వాళ్లు దొరికినకాడికి చీరలను చాకచక్యంగా దుకాణం దాటించేస్తారు. ఇది ఏ సినిమాలోనో జరిగిన దొంగతనం కాదండీ. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర శారీ సెంటర్‌లో పట్టపగలే ఈ చోరీ జరిగింది.

దుకాణంలో కౌంటరుపై ఉన్న బాలికను నలుగురు మహిళలు మాటల్లో పెట్టి దొంగతనానికి పాల్పడ్డారు. రూ.20 వేల విలువ చేసే చీరలను గుర్తుతెలియని నలుగురు మహిళలు ఎత్తుకెళ్లారు. ఆ నలుగురు మహిళలు చీరలను ఎత్తుకెళ్లే దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. దుకాణ యజమాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు భిక్కనూరు పోలీస్‌లు కేసు నమోదు చేసుకొని సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. ఆ నలుగురు మహిళలు ఎంత చాకచక్యంగా చీరలను దొంగిలించారో మీరూ చూడండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని