logo

పైథాన్‌ పై పట్టుంటే... కొలువు మీ వెంటే..!

దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలకు వేర్వేరు భాషలు ఎలా ఉన్నాయో.. కంప్యూటర్లకూ అలాగే లాంగ్వేజస్‌ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ప్రాచుర్యం పొందిన ప్రోగామింగ్‌లో పైథాన్‌ ఒకటి. ఇది మెరుగైన సంక్షిప్త సరళమైన కోడింగ్‌ కలిగిన

Updated : 28 Jan 2022 04:57 IST

కానూరు, న్యూస్‌టుడే

దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలకు వేర్వేరు భాషలు ఎలా ఉన్నాయో.. కంప్యూటర్లకూ అలాగే లాంగ్వేజస్‌ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ప్రాచుర్యం పొందిన ప్రోగామింగ్‌లో పైథాన్‌ ఒకటి. ఇది మెరుగైన సంక్షిప్త సరళమైన కోడింగ్‌ కలిగిన కంప్యూటర్‌ భాష. ఈ కారణంగా పైథాన్‌ డెవలపర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. దీనిపై పట్టు సాధించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులు అధిక వేతనాలతో బహుళజాతి సంస్థలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ యువత పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

లాంగ్వేజ్‌ ప్రత్యేకతలు ఏంటి?

సాఫ్ట్ట్‌వేర్‌, టెస్టింగ్‌, వెబ్‌, యాప్‌ డెవలప్‌మెంట్‌, డేటాసైన్స్‌ వంటి అనేక విభాగాల్లో పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ కీలకంగా మారింది. గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి సంస్థలు పైథాన్‌ను వినియోగిస్తున్నాయి.
విద్యార్థులకు ఈ టెక్నాలజీ.. 

సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ కావాలనుకునే విద్యార్థులు పైథాన్‌ టెక్నాలజీ నేర్చుకోవచ్చు. మొదటి ఏడాది నుంచే పలువురు ఆసక్తి చూపుతున్నారు. సీ, సీప్లస్‌ప్లస్‌తో పాటు కొందరు రెండో ఏడాదిలో నేర్చుకుంటున్నారు. నాలుగేళ్లలో ఎప్పుడైనా అందుబాటులో ఉన్న సర్టిఫికేషన్ల ద్వారా నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.

నేర్చుకుంటే సులువే..  

పైథాన్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ సీ, సీప్లస్‌ ప్లస్‌, జావా తదితర ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజస్‌ కన్నా సులభంగా ఉంటుంది. వాటి కంటే తక్కువ కోడింగ్‌తో మైరుగైన ఫలితాలు ఇవ్వడంలో దీనికి ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ  లాంగ్వేజ్‌కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా బ్లాగులు ఫోరమ్‌ల ద్వారా సాంకేతిక సమస్యలు, సందేహాలకు సమాధానాలు లభిస్తాయి.


అవకాశాలు మెండు

* ఈ టెక్నాలజీలో నైపుణ్యాలు సాధించిన వారు ప్రాథమికంగా పైథాన్‌ డెవలపర్‌గా కెరీర్‌ ప్రారంభించవచ్చు. వెబ్‌ సైట్‌లను రూపొందించడం, డేటా అనలటిక్స్‌ను సంబంధించిన సమస్యలను పరిష్కరించడం, సమర్థమైన కోడింగ్‌ రాయడం, డేటా అలగార్థమ్స్‌ను ఆప్టిమైజ్‌ చేయడం, డేటా ప్రొటెక్షన్‌, సెక్యూరిటీ బాధ్యతలను నిర్వహిస్తారు.
* పైథాన్‌ నిపుణులు డేటా అనలిస్టుగా పనిచేయవచ్చు. భారీ మొత్తంలో ఉండే డేటా నిర్వహణ కోసం చాలా సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి.
* ప్రాడెక్టు మేనేజర్‌గా పలు సంస్థలు అవకాశాలు ఇస్తున్నాయి. నైపుణ్యం కలిగిన ప్రాడెక్టు మేనేజర్‌లకు విపరీతమైన డిమాండు ఉంది.
* గత రెండేళ్లలో మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు భారీగా పెరిగాయి. యంత్రాలు, ప్రోగ్రామ్‌లు, ఇతర కంప్యూటర్‌ ఆధారిత సిస్టమ్‌లను రూపొందించడంలో మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్లది ప్రధాన పాత్ర. పైథాన్‌లో నైపుణ్యం కలిగి, డేటా ఆటోమేషన్‌, అల్గార్థిమ్స్‌లో పనిచేసే సామర్థ్యం  ఉంటే మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్‌గా మంచి అవకాశాలు ఉన్నాయి.


ఆన్‌లైన్‌లో సర్టిఫికేషన్లు చేసుకోవచ్చు 

ఈ లాంగ్వేజ్‌ నైపుణ్యాభివృద్ధికి ఐబీఎం, సిస్కో, వీఎంవేర్‌ వంటి సంస్థలు అందించే ఆన్‌లైన్‌ సర్టిఫికేషన్‌లు చేయవచ్చు. పైథాన్‌ ప్రోగ్రామింగ్‌, డేటా సైన్స్‌విత్‌ పైథాన్‌ కోర్సు, సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ మెషీన్‌ లెర్నింగ్‌, ఐఏ విత్‌ పైథాన్‌, పైథాన్‌ ట్నైనింగ్‌ కోర్సు, వంటి సర్టిఫికేషన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మూక్స్‌ విధానంలో ఆన్‌లైన్‌లో అవగాహన పెంచుకోవచ్చు. ఈ లాంగ్వేజ్‌ను యూట్యూబ్‌లోను ఉచితంగా నేర్చుకోవచ్చు.

- కొర్రెపాటి సాయిరోహిత్‌, నిపుణుడు


రూ.లక్షల్లో వేతనాలు 

పైథాన్‌పై పట్టు సాధిస్తే రూ.లక్షల్లో వేతనాలు పొందవచ్చు. సంస్థ, హోదా, పనిచేసే ప్రాంతం, సంబంధిత సర్టిఫికేషన్ల, నైపుణ్యాలను అనుసరించి వేతనం ఉంటుంది. ఈ నైపుణ్యం ఉన్న సాఫ్టువేర్‌ డెవలపర్‌కు ఏడాదికి రూ.5లక్షల వరకు వేతనం వస్తుంది. అనుభవనంతో పాటు అదనపు నైపుణ్యాలుంటే వార్షిక వేతనం రూ.10 లక్షల వరకు ఉంటుంది. అమెజాన్‌, యాక్సెంచర్‌, కాగ్నిజెంట్‌, టాటా కన్సల్టెన్సీ వంటి సంస్థలు ఈ నైపుణ్యాలు ఉన్న వారిని నియమించుకుంటున్నాయి. ఇందులో మరింత నిపుణులైతే వార్షిక వేతనం రూ.20 లక్షలు అందుకోవచ్చు.

- బీఎన్‌ దుర్గాప్రసాదు, విద్యావేత్త


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని