logo
Updated : 28/11/2021 06:06 IST

అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు కృషి

అపోలో ఆసుపత్రుల ఛైర్మన్‌ డా.ప్రతాప్‌ సి.రెడ్డి

ఎంబీబీఎస్‌ పట్టాలందుకున్న విద్యార్థులతో డా.ప్రతాప్‌ సి.రెడ్డి , ప్రొ.బి.కరుణాకర్‌రెడ్డి తదితరులు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: ప్రపంచంలోనే మెరుగైన వైద్యం దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నది తన ధ్యేయమని అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డా.ప్రతాప్‌ సి.రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌లోని ‘అపోలో’ వైద్య కళాశాల 3వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2014, 2015 బ్యాచ్‌లకు చెందిన మెడికల్‌ గ్రాడ్యుయేట్లు(ఎంబీబీఎస్‌) 200 మందికి ఆసుపత్రి ప్రాంగణంలో పట్టాలు ప్రదానం చేశారు. రెండు బ్యాచ్‌ల నుంచి ఉత్తమ విద్యార్థులుగా ఎంపికైన డా.కీర్తన, డా.గణేష్‌రెడ్డి లకు డా.ప్రతాప్‌ సి.రెడ్డి గోల్డ్‌ మెడల్‌ అందజేశారు. కార్యక్రమానికి అపోలో ఎడ్యుకేషనల్‌, రీసెర్చి ఫౌండేషన్‌ సెక్రటరీ డా.సంగీతారెడ్డి, కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.బి.కరుణాకర్‌రెడ్డి, ఆసుపత్రి చీఫ్‌ కార్డియో సర్జన్‌ డా.విజయ్‌దీక్షిత్‌ హాజరయ్యారు. అనంతరం డా.ప్రతాప్‌ సి.రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించాలని పట్టా గ్రహీతలకు సూచించారు. అపోలో హాస్పిటల్స్‌ రీజినల్‌ సీఈవో వై.సుబ్రహ్మణ్యం, మెడికల్‌ కళాశాల సీవోవో అపర్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని