logo
Published : 28/11/2021 04:15 IST

లేఅవుట్లలో 60శాతం ఖాళీ స్థలమే

హెచ్‌ఎండీఏ కార్యదర్శి సంతోష్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లలో 60 శాతం ఖాళీ స్థలమే ఉంటోందని.. ఇదే అన్ని వర్గాల జనాన్ని ఆకర్షిస్తోందని హెచ్‌ఎండీఏ కార్యదర్శి సంతోష్‌ అన్నారు. శనివారం బేగంపేట టూరిజం ప్లాజాలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులతో కలిసి ఉప్పల్‌ భగాయత్‌ ఇ-వేలం రెండో ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. రియల్టర్లు, ప్రముఖ నిర్మాణ సంస్థల నిర్వాహకులు పెద్దఎత్తున పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సంతోష్‌ మాట్లాడుతూ.. ఉప్పల్‌ భగాయత్‌, ఇతర ప్రాంతాల్లో ఐదోసారి వేలానికి వెళ్తున్నామని, ఈసారీ జనం నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డి, ఎస్టేట్‌ అధికారి గంగాధర్‌, ఓఎస్‌డీ రామ్‌కిషన్‌, ఎంఎస్‌టీసీ అధికారులు రేణుపురుషోత్తం, ఉమేష్‌ చంద్ర పాల్గొని సాంకేతిక అంశాలను వివరించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని