logo
Updated : 28/11/2021 10:22 IST

Crime News: వయసు 28..చోరీలు 27

కరడుగట్టిన దొంగతో సహా మరొకరి అరెస్ట్‌
రూ.93,62,500 విలువైన సొత్తు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న ఆభరణాలు

ఈనాడు, హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌, న్యూస్‌టుడే: చోరీల్లో ఇతడి స్టైలే వేరు. దొంగతనానికి వెళ్లాల్సిన ఇంటిని ఆచితూచి ఎంపిక చేసుకుంటాడు. ఎక్కడా ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడతాడు. వయసు 28.. చేసిన చోరీలు 27. గ్రేటర్‌ పరిధిలో హల్‌చల్‌ చేస్తున్న కరడుగట్టిన దొంగ గఫార్‌ఖాన్‌, అతడి సహాయకుడు సయ్యద్‌ ఖాజా పాషాలను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.89,92,000 విలువజేసే 1.805 కిలోగ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.90 లక్షల నగదు, ద్విచక్ర వాహనం, 10 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.93,62,500 ఉంటుందని అంచనా వేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో శనివారం సీపీ మహేశ్‌ భగవత్‌ ఈ వివరాలను వెల్లడించారు. యాకత్‌పుర ప్రాంతానికి చెందిన గఫార్‌ఖాన్‌ అలియాస్‌ జిగర్‌(28) పూల అలంకరణ చేస్తుంటాడు. విలాస జీవితానికి అలవాటు పడి చోరీలు ప్రారంభించాడు. ముఖానికి మాస్కు, వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు ధరించి చోరీ చేస్తాడు. నగరంలోని పలు ఠాణాల పరిధిలో 27 చోరీలు చేశాడు. వీటిలో 5 చోరీల్లో నిందితుడిపై దోపిడీ కేసులున్నాయి. చోరీ చేసిన సొత్తును యాకత్‌పుర ప్రాంతానికి చెందిన బంగారు పాలిష్‌ చేసే సయ్యద్‌ ఖాజా పాషా(32)కు ఇచ్చేవాడు. పెద్దమొత్తంలో నగదు చేతికి రాగానే జల్సాలు, బెట్టింగ్‌ల్లో పెట్టేవాడు. పలుమార్లు జైలుకెళ్లొచ్చినా మార్పు రాకపోవటంతో 2018లో పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. ఇటీవల సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో ఉండే అనిత ఇంట్లో 17 తులాల బంగారం చోరీకి గురైంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి దొంగను పట్టుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని