logo
Published : 29/11/2021 00:35 IST

సదస్సులతో ఉషస్సు

చట్టాలపై అవగాహన కల్పిస్తున్న జిల్లా అదనపు న్యాయమూర్తి పద్మ

న్యూస్‌టుడే, వికారాబాద్‌: నిత్యం నేర పరిశోధన, కేసులతో తీరిక లేకుండా గడిపే పోలీసు అధికారులు, న్యాయమూర్తులు బాలలపై దృష్టి సారించారు. వారి హక్కులు, చట్టాలపై ప్రచారం చేపట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా విద్యా సంస్థలో రేపటి పౌరులకు అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో నేరాల నివారణకు దోహద పడుతుందన్న లక్ష్యంతో సైబర్‌ నేరాలు జరిగే తీరు, అప్రమత్తంగా వ్యవహరించి ఏలా నివారించాలన్న దానిపై కనీస పరిజ్ఞానం కల్పించారు. బాలలకు ఉన్న హక్కులు, చట్టాలు, వాటిని ఎలా వినియోగించుకోవాలి, పోలీసుల పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కళాశాలలు, వసతిగృహాలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థులతో మమేకమయ్యారు. గ్రామాల్లో సైతం కార్యక్రమాలు చేపట్టారు. షీ బృందాలు, వేధింపులకు గురి చేస్తే ఉన్న చట్టాలు, పోలీసులు తీసుకునే చర్యల గురించి వివరించారు. కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు.  జిల్లాలో మహిళలపై వేధింపులు కొంత ఎక్కువే. పలువురు విద్యార్థినులు, యువతులు, మహిళలు వేధింపులకు గురవుతున్నా బయటకు చెప్పుకోవడం లేదు. మరికొందరు పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియక మిన్నకుంటున్నారు. బాల్య వివాహాల సంఖ్య కూడా జిల్లాలో ఎక్కువగానే ఉంది. బాల్య వివాహం జరుగుతుంటే 1098కి ఫోన్‌ చేయాలనే ఆలోచన చాలా మందిలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలల చట్టాలు, హక్కులపై జిల్లాలో పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఎంతో అవసరం. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు బాల్య వివాహాలు జరుగుతున్నట్లు 567 ఫోన్లు రాగా, చాలా పెళ్లిళ్లను నిలిపివేసి, తల్లిదండ్రులకు పోలీసులు అవగాహన కల్పించారు. దీనితో పాటు బాలకార్మికులను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు పెట్టి 230 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనల నిరోధానికి సదస్సులు దోహదం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు.

మంచి స్పందన వచ్చింది..
- ఎం.నారాయణ, జిల్లా పోలీసు అధికారి
జిల్లాలో నిర్వహించిన చట్టాలపై అవగాహన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. గ్రామాల్లోని ప్రజలకు, విద్యార్థులకు చట్టాలు, వాటి ద్వారా ఉండే శిక్షల గురించి వివరించాం. దీని ద్వారా వారికి అవగాహన పెరగడంతో పాటు నేరాల నియంత్రణకు కూడా దోహదపడుతోంది. చాలా మందికి అన్యాయం జరిగినప్పుడు పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియదు. అన్యాయం జరిగిన మహిళల పేర్లు గోప్యంగా ఉంటాయని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే విషయాన్ని అవగాహన కల్పించాం. బాల్య వివాహాలు చేయకూడదని, పనిలో చిన్న పిల్లలను పెట్టుకోవద్దని చెప్పాం
.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని