logo
Published : 29/11/2021 01:43 IST

వివాహిత చిత్రాలు మార్ఫింగ్‌ చేసి వేధింపులు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఓ వివాహిత చిత్రాలను మార్ఫింగ్‌ చేసిన ఆగంతకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు. ఠాణా పరిధిలో ఉండే ఓ వివాహిత ఇటీవల ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఎవరో ఆగంతకులు తన ఫొటోలు తీసి, మార్ఫింగ్‌ చేయడంతోపాటు అసభ్య, అభ్యంతరకర పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ నిమిత్తం కేసును ఎస్సార్‌నగర్‌ పోలీసులకు బదిలీ చేశారు. సాంకేతిక ఆధారాలతో త్వరలో నిందితుడిని పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. బాధితురాలు ఏపీలోని ఓ ఎమ్మెల్యే బంధువని సమాచారం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని