logo
Published : 29/11/2021 01:43 IST

ఘటన భయానకం.. తప్పిన ప్రాణాపాయం

లారీ ఢీకొనడంతో కారు కిందకు చొచ్చుకుపోయిన మరో కారు

గన్నేరువరం, న్యూస్‌టుడే: ఓ ఆటోరిక్షా రోడ్డుపై మలుపు దాటుతుండగా అదే దారిలో వస్తున్న రెండు కార్లు నెమ్మదిగా నిలిచిపోయాయి. అంతలోనే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ హఠాత్తుగా కారుకు ఢీకొట్టగా ఆ కారు ముందు ఉన్న కారు కిందకు అమాంతం చొచ్చుకుపోయింది. కనురెప్పపాటులో జరిగిన ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసంకాగా నలుగురు వ్యక్తులు కారులోనే ఇరుక్కుపోయారు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం రాజీవ్‌ రహదారిలోని గుండ్లపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన కోళ్ల ప్రసన్న కుమార్‌ ఇటీవల నూతన కారు కొనుగోలు చేసి వేములవాడ రాజన్న దర్శనానికి కుటుంబంతో వెళుతున్నాడు. మరోకారులో హైదరాబాద్‌కు చెందిన వీర వెంకట సత్యనారాయణ పని నిమిత్తం కరీంనగర్‌ వెళ్తున్నాడు. వీరి రెండు కార్లు ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోవడంతో పోలీసులు క్రేన్‌ సాయంతో రెండు కార్లను విడిపించి అందులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పగా ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మామిడాల సురేందర్‌ వివరించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని