Ts News: డిమాండ్లు పరిష్కరిస్తేనే ఆర్డర్లు తీసుకుంటాం.. సమ్మె బాటలో స్విగ్గి డెలివరీ బాయ్స్

స్విగ్గి డెలివరీ బాయ్స్ సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆర్డర్లు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. పెరిగిన పెట్రోల్, నిత్యావసర ధరలతో ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు సైతం చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. స్విగ్గి యాజమాన్యం గతంలో లాగా మినిమం...

Updated : 29 Nov 2021 16:34 IST

హైదరాబాద్‌: స్విగ్గి డెలివరీ బాయ్స్ సమ్మె బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆర్డర్లు తీసుకునేది లేదని స్పష్టం చేశారు. పెరిగిన పెట్రోల్, నిత్యావసర ధరలతో ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు సైతం చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు. స్విగ్గి యాజమాన్యం గతంలో లాగా మినిమం బేస్ ఫెయిర్‌ను రూ.35 చెల్లించాలని, దూర ప్రాంత డెలివరీలకు ఇప్పుడు ఇస్తున్న రూ.6ను రూ.12కు పెంచాలని కోరుతున్నారు. థర్డ్ పార్టీలకు ఆర్డర్లు ఇవ్వకుండా.. సంస్థ కోసం పనిచేస్తోన్న తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్విగ్గిలో ఆర్డర్లు తీసుకోబోమని హెచ్చరించారు. వినియోగదారులు, హోటల్స్ నిర్వాహకులు తమ న్యాయమైన నిరసనకు మద్దతివ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని