logo
Updated : 30/11/2021 03:13 IST

చిత్ర వార్తలు

ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్‌ విధులు

టీ కార్యాలయాలు క్రమంగా ప్రారంభమవుతుండడంతో హైటెక్‌సిటీ రహదారులపై వాహన సంచారం పెరిగి ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. దీంతో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సహాయంతో కొందరు ఐటీ ఉద్యోగులు తమ విధులు ముగిసిన అనంతరం సిగ్నల్‌, ట్రాఫిక్‌ సిబ్బంది లేని కూడళ్లలో నిలబడి వాహనాలను నియంత్రిస్తున్నారు.


శివయ్య.. చల్లగా చూడయ్య

కార్తికమాసం చివరి సోమవారం కావడంతో కీసరగుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు. రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక దీపాలు      వెలిగించారు. -న్యూస్‌టుడే, కీసర


పురాతన మెట్లబావి ప్రారంభించిన కేటీఆర్‌

మెహిదీపట్నం: లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో గండిపేట వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన పురాతన మెట్ల బావిని మంత్రి కేటీఆర్‌ సోమవారం రాత్రి ప్రారంభించారు. ఇక్కడ జరిగిన ముషాయిరా, కవ్వాలీలో కేటీఆర్‌తో పాటు మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, మేయర్‌ విజయలక్ష్మి, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.


వ్యర్థరహితం చేయాలి.. పర్యావరణహితంగా మార్చాలి

మూసీనది ప్రక్షాళనలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నారు అధికారులు. చాదర్‌ఘాట్‌ పరిధి సాలార్‌జంగ్‌ మ్యూజియం ఎదురుగా నదికి అడ్డుగా భారీ వల వేసి ఎప్పటికప్పుడు వ్యర్థాలను ఒడ్డుకు లాగుతున్నారు. మురుగునీటిని శుద్ధి చేసి నదిలో కలుపుతున్నారు. మరోవైపు సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి.  


పట్టపగలు.. మంచు తెరలు

సాధారణంగా ఉదయం వేళ పొగమంచును చూస్తుంటాం. అందుకు భిన్నంగా సోమవారం మిట్టమధ్యాహ్నం ట్యాంక్‌బండ్‌ ప్రాంతాన్ని మంచుతెరలు కప్పేశాయి. దాంతోపాటు  చల్లటి గాలుల్ని నగరవాసులు ఆస్వాదించారు.


ఆర్టీసీ బస్సులో.. ఎండీ కుటుంబ సపరివారంగా!

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. శుభప్రదం అని బస్సులపైన రాయడమే కాదు.. వాటిల్లో స్వయంగా ప్రయాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌. హయత్‌నగర్‌-1 డిపోకు చెందిన రాజధాని బస్సులో ఇటీవల కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి అనంతపురం వెళ్లారు. ఆ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.


నంతగిరి పద్మనాభ స్వామి కార్తిక పెద్ద జాతర ఉత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం పుష్కరిణిలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అర్చకులు  


సాయిపూరు రామలింగేశ్వర దేవాలయంలో..  

కార్తిక మాసం చివరి సోమవారం తాండూరు నియోజక వర్గంలోని శైవక్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడుల్లో కొలువు దీరిన శివలింగాలకు రుద్రాభిషేకాలు చేసి అలంకరించారు. మహిళలు కార్తిక దీపారాధన చేశారు.

- న్యూస్‌టుడే, తాండూరు

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

బిజినెస్

క్రీడలు

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జాతీయం