logo
Published : 30/11/2021 00:49 IST

పేదల బియ్యం పక్కదారి

న్యూస్‌టుడే, వికారాబాద్‌

గడిసింగాపూర్‌లో పట్టుబడ్డ 101 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం

* ఈ నెల 20న వికారాబాద్‌ పట్టణం ఆలంపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 79 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని వ్యాపారిపై కేసు నమోదు చేశారు.

* గతేడాది నవంబరు 25న పరిగి మండలం గడిసింగాపూర్‌ చౌకధరల దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 101 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు తనిఖీ చేసి జప్తు చేశారు.

* రాజీవ్‌గృహకల్పకు చెందిన ఓ వ్యక్తి రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు 90 క్వింటాళ్లు కొనుగోలు చేసి, లారీలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన వ్యాపారులకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
ఇలా.. పేదలకు చెందాల్సిన చౌకధరల బియ్యాన్ని కొంత మంది వ్యాపారులు సన్నగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నా ఫలించడంలేదు. గుట్టుగా కొనసాగుతున్న చీకటి వ్యాపారాన్ని పోలీసులు సమాచారం మేరకు రట్టు చేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా బహిర్గతం కాకుండా పునర్వినియోగం దందా జోరుగా సాగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జిల్లాలో అక్రమ రవాణా చేస్తున్న 1,519 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని 63 కేసులు నమోదు చేసి 22 వాహనాలను సీజ్‌ చేశారు. జిల్లాలో 588 రేషన్‌ దుకాణాలు, 2,41,622 రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో ఆహార భద్రత కార్డులు 2,08,162, అంత్యోదయ కార్డులు 26,730, అన్నపూర్ణకార్డులు 39 ఉన్నాయి. ఈ కార్డులకు సరిపడా నెలవారీగా 8,840.26 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.

గ్రామీణుల నుంచి సేకరణ..
ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యాన్ని అక్రమార్కులు ఏజెంట్లను నియమించుకుని సేకరిస్తున్నారు. కరోనా సమయంలో ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కిలో రూ.6 నుంచి రూ.8కి కొనుగోలు చేశారు. ఇలా సేకరించిన బియ్యాన్ని మిల్లర్లకు కిలో రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. మిల్లర్లు వాటిని మరాడించి సన్నగా మారుస్తున్నారు. పాలిష్‌ చేసి వాటిని బస్తాల్లో నింపి గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. మిల్లర్లు చుట్టు పక్కల గ్రామాల నుంచి ఏజెంట్ల ద్వారా రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. రాత్రి వేళ్లల్లో రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి సంచుల ద్వారా ఉదయం వేళలో గోదాంలకు తరలించి వాటిని మరో సంచుల్లోకి మార్చి కొత్త స్టిక్కర్లు అంటించి సన్న బియ్యంగా వ్యాపారులకు విక్రయిస్తున్నారు.


అరికట్టేందుకు చర్యలు
- రాజేశ్వర్‌, జిల్లా అధికారి, పౌర సరఫరాలశాఖ

పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో సంయుక్తంగా నిఘా వేసి రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొడంగల్‌ నుంచి రావులపల్లి మీదుగా కర్ణాటకకు, మరో మార్గంలో జహీరాబాద్‌ మీదుగా కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించాం.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని