logo
Published : 30/11/2021 00:49 IST

టీయూటీఎఫ్‌ అధ్యక్షుడిగా సత్యనారాయణరెడ్డి

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా శాఖ సర్వసభ్య సమావేశంలో జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.గోపాల్‌, పరిశీలకుడిగా దేవేందర్‌రెడ్డి వ్యవహరించారు. గౌరవ అధ్యక్షునిగా బస్వరాజ్‌, ప్రధాన కార్యదర్శిగా దేవ్యానాయక్‌, ఉపాధ్యక్షులుగా సమియోద్దీన్‌, శివప్ప, కార్యదర్శులుగా వెంకటయ్య, విష్ణువర్ధన్‌, ఎల్లయ్య, సంతోష్‌కుమార్‌, గోపాల్‌, రూప్‌సింగ్‌, సంయుక్త కార్యదర్శులుగా వీరయ్య, బాలకృష్ణ, ఆర్థిక కార్యదర్శిగా దేవయ్య, మహిళా ఉపాధ్యక్షులుగా అనిత, మహిళా సంయుక్త కార్యదర్శిగా బాలమణి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని