logo
Published : 30/11/2021 00:49 IST

రైతు సమస్యలను పరిష్కరించండి


జిల్లా అదనపు పాలనాధికారి చంద్రయ్యకు వినతిపత్రం అందజేస్తున్న నాగేందర్‌గౌడ్‌

వికారాబాద్‌ మున్సిపాలిటీ: ధరణి ఆన్‌లైన్‌లో సర్వే నంబర్లు తప్పుగా నమోదు కావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌ అధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా అదనపు పాలనాధికారి చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. నవాబ్‌పేట మండలం అత్తాపూర్‌ గ్రామానికి చెందిన రైతుల భూముల సర్వే నంబర్లు పొరపాటున రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం అత్తాపూర్‌లో ఉన్నట్లు నమోదు చేశారని, విచారణ జరిపి మార్పు చేయాలన్నారు. అనంతగిరి నుంచి ప్రవహించే మూసీ నది నీటిలో వివిధ గ్రామాలకు చెందిన మురుగు కలిసి కలుషితమవుతోందని, చివరకు గండిపేటలో కలుస్తోందని పేర్కొన్నారు. ఆయన వెంట అత్తాపూర్‌ రైతులున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని