logo
Published : 30/11/2021 03:21 IST

కొత్త ఓటరు దరఖాస్తుకు నేడే ఆఖరు: జీహెచ్‌ఎంసీ

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త ఓటర్లుగా నమోదు కావాలనుకున్న వారు దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారంతో ముగియనుందని జీహెచ్‌ఎంసీ సోమవారం ప్రకటించింది. ఈనెల 1వ తేదీన ప్రచురితమైన ముసాయిదా ఓటరు జాబితాలో.. తమ కార్డుల్లోని చిరునామా, పేరులో సవరణలు కోరుకునేవారు లేదా ఓటరు జాబితాపై ఫిర్యాదులకూ ఇది చివరి అవకాశమని వెల్లడించింది. అలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది ఓటరు జాబితాను జనవరి 5, 2022న ప్రచురించనున్నారు. మంగళవారం సాయంత్రం వరకు వచ్చే దరఖాస్తులన్నింటికీ అందులో చోటు దక్కుతుంది. తర్వాత వచ్చే దరఖాస్తులనూ తీసుకుంటామని, కానీ తుది ఓటరు జాబితాలో కాకుండా, తర్వాతి జాబితాలో ఓటరుగా స్థానం దక్కుతుందని వివరించారు. ఓటరు నమోదు, సవరణ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని