logo

ప్రత్యామ్నాయ పంటలే ఉత్తమం: కలెక్టర్‌

విపణిలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల సూచించారు. శనివారం కలెక్టర్‌

Published : 05 Dec 2021 00:36 IST

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: విపణిలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల సూచించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో ‘యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగు’ అనే చిన్న పుస్తకాన్ని, గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గత యాసంగి, వానా కాలంలో వరి బాగా వేశారని దీంతో విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. దిగుబడులు ఎక్కువ కావడం వల్ల వరి కొనుగోలుకు విపణిలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. తిరిగి వరిని పండించటం ద్వారా పంటల వైవిధ్యం తగ్గిపోతుందని తెలిపారు. పప్పుదినుసులు, నూనెగింజలు, కూరగాయల ఉత్పత్తికి, ప్రజల అవసరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని వివరించారు. కాబట్టి డిమాండ్‌ మేరకు పప్పుజాతి పంటలు, కూరగాయలు, నూనెగింజల ఉత్పత్తి పెంచేందుకు సాగు ముమ్మరం చేయాలని సూచించారు. జిల్లా నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటంతో వేరుసెనగ, శనగ, ఆవాలు, నువ్వులు, కుసుమ, ఆముదం, పెసర, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న తదితర పంటలు పండించి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్‌, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని