logo

సింహాల జంటను దత్తత తీసుకున్న ఉపాసన

నెహ్రూ జూపార్కులోని అరుదైన ఎసియాటిక్‌ జాతికి చెందిన ఓ సింహాల జంటను శనివారం సినీనటుడు రాంచరణ్‌ సతీమణి, అపోలో ఫౌండేషన్‌, అపోలో లైఫ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసన

Published : 05 Dec 2021 01:50 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: నెహ్రూ జూపార్కులోని అరుదైన ఎసియాటిక్‌ జాతికి చెందిన ఓ సింహాల జంటను శనివారం సినీనటుడు రాంచరణ్‌ సతీమణి, అపోలో ఫౌండేషన్‌, అపోలో లైఫ్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉపాసన తన సోదరి అనుష్పాల కామినేనితో కలిసి దత్తత తీసుకున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వీరిద్దరూ జూలోని సింహాలు విక్కీ, లక్ష్మిని దత్తత తీసుకున్నారు. గతేడాది జూలోని ఏనుగు రాణిని ఉపాసన దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. పోషణకు ఏడాదికయ్యే రూ.2 లక్షల చెక్కును జూ క్యూరేటరు ఎస్‌.రాజశేఖర్‌కు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని