logo

పోషకాలతోనే పంటకు బలం

పంటలకు తగిన పోషకాలు ఉంటేనే బలంగా ఎదుగుతాయని క్రీడా శాస్త్రవేత్త సమ్మిరెడ్డి పేర్కొన్నారు. గొంగుపల్లిలో ఆదివారం హైదరాబాద్‌కు చెందిన కృషి విజ్ఞాన సంస్థ (క్రీడా) ఆధ్వర్యంలో ప్రపంచ నేలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా

Published : 06 Dec 2021 02:27 IST

భూసార ఫలితాల కార్డులు అందజేస్తున్న శాస్త్రవేత్తలు

పూడూరు: పంటలకు తగిన పోషకాలు ఉంటేనే బలంగా ఎదుగుతాయని క్రీడా శాస్త్రవేత్త సమ్మిరెడ్డి పేర్కొన్నారు. గొంగుపల్లిలో ఆదివారం హైదరాబాద్‌కు చెందిన కృషి విజ్ఞాన సంస్థ (క్రీడా) ఆధ్వర్యంలో ప్రపంచ నేలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన రైతులకు పంటసాగు విధానం, లవణ పోషకాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పంటలకు రసాయన ఎరువుల వాడకం మోతాదులను సూచించారు. యంత్రాల సహాయంతో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలన్నారు. అనంతరం మట్టినమూనాలు చేయించిన రైతులకు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ నిర్వహకులు నిర్మల, నర్సిములు, సంజీవారెడ్డి, ఏఓ సామ్రాట్‌రెడ్డి, సర్పంచి కుల్సుంబీ ఉన్నారు.

ధారూర్‌: భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత ఖురేషి పేర్కొన్నారు.  ప్రపంచ మట్టి దినోత్సవం సందర్భంగా గురుదోట్ల గ్రామంలో భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రస్తుతం నేల పరిణామ క్రమంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని వాటి ఆధారంగా పంటలు వేసుకోవడం వలన మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. అనంతరం రైతులకు  భూసార పరీక్షల ఫలితాల కార్డులను అందజేశారు. సంస్థ ప్రతినిది రమణరావు, శాస్త్రవేత్తలు లక్ష్మమ్మ, రమ్య, ఝాన్సీరాణి, ఏఈఓలు మల్లేశం, మంజుల ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని