logo

చిత్ర వార్తలు

గర్భిణుల్లో ఒత్తిడి తగ్గించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో కిమ్స్‌ కడుల్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హెచ్‌ఐసీసీలో నిర్వహించిన మిసెస్‌మామ్‌ కాంటెస్ట్‌ ఉత్సాహభరితంగా సాగింది. కాబోయే తల్లుల ఫ్యాషన్‌షో ఆకట్టుకుంది.

Updated : 06 Dec 2021 04:21 IST

కాబోయే అమ్మలు.. ఆత్మవిశ్వాసపు అడుగులు

ర్భిణుల్లో ఒత్తిడి తగ్గించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో కిమ్స్‌ కడుల్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హెచ్‌ఐసీసీలో నిర్వహించిన మిసెస్‌మామ్‌ కాంటెస్ట్‌ ఉత్సాహభరితంగా సాగింది. కాబోయే తల్లుల ఫ్యాషన్‌షో ఆకట్టుకుంది. సినీనటుడు మంచు విష్ణు దంపతులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

-న్యూస్‌టుడే, మాదాపూర్‌


మార్జాల వయ్యారం

మార్స్‌పెట్‌కేర్‌, వెట్స్‌ సొసైటీ ఫర్‌ యానిమల్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఆదివారం మాసబ్‌ట్యాంకు వెట్స్‌హోమ్‌లో నిర్వహించిన క్యాట్‌షో-2021 అలరించింది. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ ఎన్‌.రామచందర్‌ అతిథిగా హాజరయ్యారు. 

 -ఈనాడు, హైదరాబాద్‌


ఆలపించి.. అలరించి!

కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్కులో ఆదివారం జరిగిన 4వ అంతర్జాతీయ  జాజ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. జర్మన్‌ అంబాసిడర్‌ వాల్టర్‌జే లిండర్‌ ఫ్లూట్‌ వాద్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 -న్యూస్‌టుడే, గోల్కొండ


జలవనరుల్లో వ్యర్థం.. జలచరాలకు అనర్థం

చెరువుల్లో కలుస్తున్న వ్యర్థాలు చేపల పాలిట శాపంగా మారుతున్నాయి. కాలుష్య నీటితో ప్రాణవాయువు తక్కువవుతుండడంతో ఆహారం లభించడం గగనమవుతోంది. దీంతో ప్లాస్టిక్‌ సంచుల్లోని ఆహారం కోసం పోటీపడుతున్నాయి. హయత్‌నగర్‌ బాతులచెరువు వద్ద కనిపించిందీ దృశ్యం.


గోడపై గీతలు కావివి.. భావి తరాలకు బాటలు

పిచ్చిరాతలు, సినిమా పత్రికలు, ప్రకటనలు అంటిస్తూ గోడలను ఆగం చేస్తున్నారు కొందరు. దీనికి అడ్డుకట్ట వేయడంతోపాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు చాటిచెప్పేందుకు ఉస్మానియా వర్సిటీ అధికారులు కొత్త పంథా ఎంచుకున్నారు. గోడలపై బోనాలు, బతుకమ్మ, పల్లె వైభవాన్ని ప్రతిబింబించే చిత్రాలను గీయిస్తున్నారు. మహిళా వసతి గృహాల చెంత గీయించిన చిత్రాలివి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని