logo

వైరస్‌ జన్యువుపై పరిశోధన 

సాధారణంగా జన్యుక్రమం కనుగొనేందుకు కనీసం 48 నుంచి 72 గంటలు పడుతుంది. ప్రస్తుత అత్యవసర పరిస్థితి దృష్ట్యా నాలుగైదు నమూనాలున్నా నానో యంత్రంపై చేస్తున్నారు. నేరుగా ఆర్‌ఎన్‌ఏ నమూనాలు వస్తే తక్కువ సమయంలో గుర్తించడం వీలవుతుందని..

Updated : 06 Dec 2021 06:35 IST

నేడు ఫలితాలు?

ఈనాడు, హైదరాబాద్‌: సాధారణంగా జన్యుక్రమం కనుగొనేందుకు కనీసం 48 నుంచి 72 గంటలు పడుతుంది. ప్రస్తుత అత్యవసర పరిస్థితి దృష్ట్యా నాలుగైదు నమూనాలున్నా నానో యంత్రంపై చేస్తున్నారు. నేరుగా ఆర్‌ఎన్‌ఏ నమూనాలు వస్తే తక్కువ సమయంలో గుర్తించడం వీలవుతుందని.. ప్రస్తుతం వైరల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మీడియం నుంచి వస్తుండటంతో ఆర్‌ఎన్‌ఏ తీసి ఆర్‌టీ పీసీఆర్‌పై పరీక్షిస్తారు.నమూనాల నాణ్యత కూడా కీలకం. 48 గంటలు దాటితే జన్యుక్రమం కనుగొనేందుకు ఉపయోగపడవు. ప్రస్తుతం విదేశాల నుంచి నగరానికి వస్తున్న ప్రయాణికులకు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ల నమూనాలను సేకరించి జన్యుక్రమాలను కనుగొనేందుకు పరిశోధన సంస్థలు సీడీఎఫ్‌డీ, సీసీఎంబీకి పంపిస్తున్నారు. వీటిలో ఒమిక్రాన్‌ కేసులు, వైరస్‌ మూలాలను గుర్తించవచ్ఛు ఒమిక్రాన్‌ మూలాలున్నాయా? లేక కొత్తవి కన్పించాయా అనేది విశ్లేషిస్తారు. భారత్‌కు వచ్చాక కొత్త ఉత్పరివర్తనాలు వచ్చాయా? పరిశీలిస్తారు. తొలుత ఏరకం అనేది స్పష్టం చేశాక మిగతావన్నీ మరింత లోతుగా అధ్యయనం చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని