logo

‘యుగ తులసి’ గో ఆగ్రహ దీక్ష భగ్నం

యుగ తులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన గో ఆగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బహద్దూర్‌పురాలో తలపెట్టిన ఈ దీక్షకు పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో ఎలాగైనా అక్కడికి చేరుకుని దీక్ష చేపట్టాలన్న

Published : 06 Dec 2021 04:23 IST


అరెస్టు చేయడంతో పోలీసు స్టేషన్‌లో ఉన్న శివకుమార్‌

ఖైరతాబాద్‌, బన్సీలాల్‌పేట- న్యూస్‌టుడే: యుగ తులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన గో ఆగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బహద్దూర్‌పురాలో తలపెట్టిన ఈ దీక్షకు పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో ఎలాగైనా అక్కడికి చేరుకుని దీక్ష చేపట్టాలన్న ఆలోచనతో ఫౌండేషన్‌ ప్రతినిధులు వివిధ మార్గాల్లో బయల్దేరారు. లక్డీకాపూల్‌లోని వెంకటేశ్వర హోటల్‌లో ఉన్న ఫౌండేషన్‌ ఛైర్మన్‌, తితిదే బోర్డు మాజీ సభ్యుడు శివకుమార్‌, ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డుంకులు సృష్టించినా.. కబేళాలను మూసేదాకా దీక్ష నిర్వహిస్తామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని