logo

మహిళల వల్లే హుజూరాబాద్‌ గెలుపు

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో మహిళలే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ (భాజపా) మహిళా మోర్చా హిమాయత్‌నగర్‌ మహిళా పోలింగ్‌ బూత్‌ కమిటీ సమావేశం నారాయణగూడలోని

Published : 06 Dec 2021 04:23 IST


అభివృద్ధి పనులపై కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రామన్‌గౌడ్‌, గౌతమ్‌రావు, మహాలక్ష్మి, గీతామూర్తి, శారద తదితరులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో మహిళలే తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ (భాజపా) మహిళా మోర్చా హిమాయత్‌నగర్‌ మహిళా పోలింగ్‌ బూత్‌ కమిటీ సమావేశం నారాయణగూడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించారు. మహిళా మోర్చా హిమాయత్‌నగర్‌ అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని మార్చి వరకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. భాజపా సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌రావు, కార్పొరేటర్‌ మహాలక్ష్మి, పార్టీ రాష్ట్ర నాయకుడు జి.రామన్‌గౌడ్‌, కార్పొరేటర్లు అమృత, పద్మా వెంకట్‌రెడ్డి, వెంకటేశ్‌, పి.ప్రసాద్‌, నర్సింగరావు ముదిరాజ్‌, నర్సింగ్‌గౌడ్‌, మహేష్‌, మైనారిటీ మోర్చా నాయకుడు లాయక్‌ అలీ, ఇన్‌ఛార్జి సందీప్‌సాయి, మాధవి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని