Hyderabad News: హమ్మయ్య.. బ్రిటన్‌ నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ లేదు..

బ్రిటన్‌ నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్‌కు నెగెటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు.

Updated : 06 Dec 2021 09:06 IST

హైదరాబాద్‌: బ్రిటన్‌ నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. జీనోమ్‌ సీక్వెన్స్‌ రిపోర్టులో మహిళకు నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. కాగా మరో 12 మంది బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రయాణికుల జీనోమ్‌ రిపోర్టు రావాల్సి ఉందని చెప్పారు. జీనోమ్‌ సీక్వెన్స్‌ ఫలితంలో నెగెటివ్‌ వచ్చిన మహిళకు కరోనా నిర్ధరణ కావడంతో ఆమె టిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా వెల్లడైన ఫలితంలో మహిళకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకలేదని తేలడం ఊరటనిచ్చే అంశం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని