logo

ఆరుతడి పంటలపై అవగాహన: పాలనాధికారిణి

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగుచేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల వ్యవసాయాధికారులకు సూచించారు. అదనపు పాలనాధికారి చంద్రయ్య, జిల్లా వ్యవసాయాధికారి

Published : 07 Dec 2021 01:22 IST

వ్యవసాయ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిఖిల

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగుచేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారిణి నిఖిల వ్యవసాయాధికారులకు సూచించారు. అదనపు పాలనాధికారి చంద్రయ్య, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌లతో కలిసి సోమవారం పరిగి మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన ప్రతి రైతును కలిసి వరికి బదులుగా ఇతర పంటలు వేసుకునేలా నచ్చజెప్పాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు వెంకట్రాంరెడ్డి, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్‌రెడ్డి, ఏఈఓ సంతోష్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని