logo

జేఎన్‌టీయూలో మెగా ఉద్యోగమేళా

జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌ సెంటర్‌ (యూఐఐసీ) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. పది, ఇంటర్‌, డిగ్రీతోపాటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంటెక్‌ తదితర

Published : 07 Dec 2021 02:38 IST

మేళా ప్రారంభోత్సవంలో వీసీ నర్సింహారెడ్డి, గోవర్దన్‌, మంజూర్‌హుస్సేన్‌ తదితరులు

కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్‌ సెంటర్‌ (యూఐఐసీ) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. పది, ఇంటర్‌, డిగ్రీతోపాటు ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంటెక్‌ తదితర కోర్సులు పూర్తిచేసిన దాదాపు 20 వేల మంది పేర్లు నమోదు చేసుకోగా మేళాకు 7,500 మంది హాజరయ్యారు. సాఫ్ట్‌వేర్‌, బ్యాంకింగ్‌, ఫార్మా తదితరాలకు సంబంధించిన 39 సంస్థలు మేళాకు రాగా 2 వేల మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆరుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏడాదికి రూ.4.5 లక్షల చొప్పున ప్యాకేజీ లభించిందని యూఐఐసీ డైరెక్టర్‌ డాక్టర్‌ తారా కల్యాణి తెలిపారు. మేళాను వీసీ కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్‌ గోవర్థన్‌, రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌ ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని