logo

నిమ్స్‌లో ఆధునిక సేవలు

నిమ్స్‌లో మరిన్ని ఆధునిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోగులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన చికిత్సలు అందించే ఉద్దేశంతో ఆధునిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు మంగళవారం

Published : 07 Dec 2021 02:38 IST

నేడు ప్రారంభించనున్న ఆరోగ్య మంత్రి

న్యూరో ఎండోస్కోపీ పరికరం

ఈనాడు, హైదరాబాద్‌: నిమ్స్‌లో మరిన్ని ఆధునిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోగులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన చికిత్సలు అందించే ఉద్దేశంతో ఆధునిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు మంగళవారం ఉదయం ఈ సేవలను ప్రారంభించనున్నారు.  ః జన్యుపరమైన వ్యాధులకు సంబంధించి విశ్లేషణ, గుర్తింపునకు కొత్తగా ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది. మొత్తం 1.15 కోట్లతో  ఆధునిక పరికరాలను సమకూర్చారు.  ః ఎముకల్లో సున్నం(బోన్‌ మాస్‌) ఎంత ఉందో తెలుసుకునే బోన్‌ డెన్సిటో మీటర్‌ అందుబాటులోకి రానుంది. ః కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మల్టీడిస్పిలినరీ రీసెర్చ్‌ యూనిట్‌  ఏర్పాటు చేశారు. ఇక్కడ జీవనశైలి వ్యాధులపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. ః రూ.2.73 కోట్లతో న్యూమాటిక్‌ ట్యూబ్‌ సిస్టమ్‌(వస్తువులను తరలించడానికి ప్రత్యేక పైపులైన్‌) ఏర్పాటు చేశారు. ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లతో సహా నిమ్స్‌లో అన్ని బ్లాక్‌లు కవర్‌ అయ్యేలా 46 స్టేషన్లు ఏర్పాటు చేశారు. ః టీఎస్‌ఐఎండీసీ ఆధ్వర్యంలో రూ.40 లక్షలతో అత్యాధునిక న్యూరో ఎండోస్కోపీని అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని మంత్రి ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని